

విజేత, సత్తుపల్లి: సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామ సొసైటీ సెక్రటరీగా విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన పొట్లపల్లి వెంకటరత్నంకు ఘన సన్మానం నిర్వహించారు. వెంకటరత్నం స్వగ్రామమైన గంగారం గ్రామంలో సత్తుపల్లి డివిజన్ కృష్ణ–మహేష్ బాబు అభిమానుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా అభిమానుల సభ్యులు కోటమర్తి వెంకటేశ్వరరావు, చల్లారి సత్యనారాయణ గౌడ్, కావూరి వెంకటేశ్వరరావు, సుగ్గుల బాబురావు, కోటమర్తి శ్రీరామమూర్తి తదితరులు వెంకటరత్నం దంపతులను శాలువాతో ఘనంగా సత్కరించారు. సొసైటీ సెక్రటరీగా ఆయన అందించిన సేవలను అభినందిస్తూ పదవీ విరమణ అనంతరం ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కృష్ణ–మహేష్ బాబు అభిమానులు, స్థానికులు పాల్గొని వెంకటరత్నం దంపతులకు అభినందనలు తెలిపారు.








