పట్టభద్రులంతా ఓటరుగా నమోదు కావాలి

కాంగ్రెస్ పార్టీ తరిగొప్పుల మండల్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎడ్ల నవీన్ కుమార్

విజేత,తరిగొప్పుల : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవడానికి అర్హులైన పట్టభద్రులంతా ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎడ్ల నవీన్ కుమార్ కోరారు.ఓటు హక్కు వినియోగం ప్రతి ఒక్కరి బాధ్యత అని, డిగ్రీ అర్హత ఉన్న యువత, పట్టభద్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పట్టభద్రుల ఓటుకు ఎంతో ప్రాధాన్యత ఉందని, అర్హత కలిగిన వారు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. దరఖాస్తుకు అవసరమైన డిగ్రీ సర్టిఫికేట్, ఇతర ఆధారాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు.నవంబర్ 6 గడువు లోపు నమోదు చేసుకుంటేనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం లభిస్తుందని తెలిపారు.

Views: 1

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :