జాతీయ స్థాయి కరాటేలో సత్తా చాటిన రెండేళ్ల బుడతడు.

విజేత,జనగామ: విశాఖపట్నంలో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో జనగామ నియోజక వర్గం చేర్యాల మండలం పరద్ద రాజుపేట కు చెందిన రెండేళ్ల చిన్నారి కొయ్యడ అయాంష్ గౌడ్ అద్భుత ప్రతిభ కనబరిచాడు. తనకంటే పెద్దవాడైన ఐదేళ్ల ప్రత్యర్థితో ధైర్యంగా స్పారింగ్ చేసి సిల్వర్ మెడల్‌తో రెండో స్థానం సాధించాడు.చిన్న వయసులోనే జాతీయ స్థాయి పోటీలో పాల్గొని ఏమాత్రం భయపడకుండా పోరాడిన అయాంష్ గౌడ్ ఆటతీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అతడి ఆత్మవిశ్వాసం, పట్టుదలను చూసి పలువురు అభినందించారు. ప్రముఖ సినీ నటుడు హీరో సుమన్, విక్టరీ షోటోకాన్ కరాటే ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఆర్. మల్లికార్జున్ గౌడ్, విక్టరీ షోటోకాన్ కరాటే అకాడమీ జనగామ జిల్లా ప్రెసిడెంట్ ఓరుగంటి సంతోష్ కుమార్, చిన్నారి ప్రతిభను అభినందించి ఆశీర్వదించారు.రెండేళ్ల వయసులోనే జాతీయ స్థాయిలో పతకం సాధించడం పట్ల అయాంష్ తండ్రి కొయ్యడ ప్రసాద్ గర్వం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని, అందరి ఆశీస్సులు అయాంష్‌కు ఉండాలని ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :