కేటీఆర్ ని కలిసిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కిషన్ నాయక్

విజేత, దేవరకొండ: మిర్యాలగూడలో జరగనున్న రైతు సంగ్రామ బహిరంగ సభకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రివర్యులు కల్వకుంట్ల తారకరామారావు ని నల్గొండలోని వేడుక కన్వెన్షన్ హాల్‌లో దేవరకొండ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నేనావత్ కిషన్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు.మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సమక్షంలో కేటీఆర్ కి పూలమాలలు వేసి, శాలువాతో ఘనంగా సత్కరించడం జరిగింది.తదనంతరం దేవరకొండ నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధి, ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కేతావత్ భీల్య నాయక్, కౌన్సిలర్ అంజి గౌడ్, నేనావత్ అనిల్, నేనావత్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.