పుల్లారావు మంచి మనసు.. విమర్శలకు చేతలతోనే సమాధానం

విజేత,చిలకలూరిపేట : ఎవరెవరు ఏమనుకున్నా.. తనపై ఎన్ని రకాలుగా విమర్శలు చేసినా.. ఎన్ని మాటలు అన్నా పత్తిపాటి పుల్లారావు మాత్రం ప్రజలపై ఉన్న ప్రేమాభిమానాలను ఎప్పుడూ వదులుకోలేదు. ప్రజలకు కష్టం వచ్చిన ప్రతిసారీ ముందుండి అండగా నిలుస్తూ తన మంచి మనసును చాటుకుంటున్నారు. చిలకలూరిపేట అడ్డరోడ్డు సమీపంలో జరిగిన ఘోర బస్సు–ఆటో ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వేలూరు గ్రామానికి చెందిన 8 మంది మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం అందేలా కృషి చేసిన నాయకుడిగా పత్తిపాటి పుల్లారావు నిలిచారు.తనను ఎన్ని రకాలుగా విమర్శించినా.. ప్రజలకు అవసరమైన సమయంలో మాత్రం రాజకీయాలకు అతీతంగా ముందుండి సహాయం చేయడం ఆయనలోని మానవత్వానికి నిదర్శనం.“కష్టకాలంలో మీకు నేనున్నాను” అని మరోసారి చాటి చెబుతూ, అడ్డరోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు పత్తిపాటి పుల్లారావు.మాటలు ఎన్ని ఉన్నా.. ప్రజల కష్టంలో నిలిచే మనసే గొప్పది.విమర్శలకు సమాధానం మాటలతో కాదు.. చేతలతో చూపించిన పుల్లారావు మంచి మనసుకు ఇదే నిదర్శనం.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :