ఘనంగా మెగా రక్తదాన శిబిరం

పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో జనసేన సముద్రం.. ఘనంగా మెగా రక్తదానం

 

విజేత,చిలకలూరిపేట : జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని చిలకలూరిపేటలోని గ్రాండ్ వెంకటేశాలో జనసేన పార్టీ యువ నాయకులు మండలనేని చరణ్ తేజ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు.జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళల పర్యవేక్షణలో నిర్వహించిన ఈ రక్తదాన శిబిరానికి పవన్ కళ్యాణ్ అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుండటంతో అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలకు మండలనేని చరణ్ తేజ కృతజ్ఞతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :