
ఎంజే పురంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 3 వరకు సరఫరా నిలిపివేత
అచ్యుతాపురం , : ఆర్‌డిఎస్‌ఎస్ పనుల్లో భాగంగా 33/11కెవి కొండకర్ల సబ్‌స్టేషన్ పరిధిలోని 11కెవి ఎంజే పురం ఫీడర్‌పై మరమ్మతులు చేపట్టనుండటంతో 11-06-2026 గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏపీఈపీడీసీఎల్ ఆపరేషన్ అనకాపల్లి ఈఈ ఎస్.రామకృష్ణ తెలిపారు.ఈ సమయంలో కొండకర్ల సెక్షన్ పరిధిలోని ఎంజే పురం గ్రామానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు అవసరమైన ఏర్పాట్లు చేసుకొని సహకరించాలని కోరారు.







