శ్రీలలితాత్రిపురసుందరీ దేవీ  కాళ్లరాత్రిదేవి అలంకారంలో ఏడుపాయల వనదుర్గాదేవి

నేత్రపర్వoగా దేవీ శరన్నవ రాత్రుల ఉత్సవాలు అమ్మవారికి మహిళలు కుంకుమార్చన- విశేష పూజలు

విజేత,పాపన్నపేట : శ్రీ ఏడుపాయల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లో దేవీశరన్నవ రాత్రుల మహోత్సవాలు వైభవోపేతంగా అంగరంగవైభవంగా దుర్గానామస్మరణలతో భక్తితన్మయంతో మారుమ్రోగుతున్నాయి. దేవీశరన్నవ రాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఏడవరోజైన శనివారం ఉత్సవ మండపంలో శ్రీలలితాత్రిపురసుందరీ దేవి- కాళ్లరాత్రి దేవీ అమ్మవారు అలంకారంలో నారింజ పట్టువస్త్రంలో వనదుర్గాదేవి భక్తులకు దర్శనమిచ్చారు.

శనివారం ఉదయం ప్రధాన ఆలయంలో శ్రీలలితాత్రిపురసుందరీ దేవి అలంకారంలో వన దుర్గాభవాని అమ్మ వారికి, గోకుల్ షెడ్ లోని ఉత్సవ మండపంలో శ్రీలలితాత్రిపురసుందరీ దేవి అలంకారంలో ఉన్న దుర్గాదేవి అమ్మవారికి వేద బ్రాహ్మణ పండితులు ఆర్ శంకర్ శర్మ, పార్టీవశర్మ, మురళీధర్ చారీ, రాజేశ్వర్ శర్మల ఆధ్వర్యంలో దేవీ నవరాత్రుల విశేష పూజలు నిర్వహించారు. ప్రధాన ఆలయంలో అర్చకులు పార్టీవశర్మ, ఉత్సవ మండపంలో వేద పండితులు, ప్రధాన అర్చకులు శంకర్ శర్మ, మురళీధర్ చారీ, రాజేశ్వర్ శర్మ లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు అమ్మవారికి కుంకుమార్చన తదితరులు పూజలు చేశారు. తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి భక్తుల పెద్దఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు ను స్వీకరించారు. ఏడుపాయల్లో దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలతో ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. ఏడుపాయల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈఓ వీరేశం ఆధ్వర్యంలో సిబ్బంది సూర్య శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, రవికుమార్,తదితర సిబ్బంది చర్యలు తీసుకున్నారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.