
గండిపేట మండలం “వార్త” సీనియర్ జర్నలిస్టు రాము యాదవ్ తండ్రి కన్నుమూత
విజేత,రాజేంద్రనగర్ : గండిపేట మండలం టీయూడబ్ల్యూజే (ఐజేయూ) అధ్యక్షులు, ప్రముఖ ‘వార్త’ దినపత్రిక సీనియర్ జర్నలిస్టు రాము యాదవ్ గారింట తీవ్ర విషాదం అలుముకుంది. అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తండ్రి.. పరిస్థితి విషమించి ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.కష్టకాలంలోనూ ప్రజాక్షేత్రంలో నిత్యం వార్తల కోసం పరితపించే తోటి జర్నలిస్టు మిత్రుడి కుటుంబంలో సంభవించిన ఈ అకస్మిక మరణం పాత్రికేయ లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దుఃఖ వార్త తెలియగానే జర్నలిస్టు వర్గాలు ఒక్కసారిగా మూగబోయాయి.రాము యాదవ్ తండ్రి మృతి పట్ల పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, మీడియా ప్రముఖులు మరియు తోటి జర్నలిస్టులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాము యాదవ్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ. వారి కుటుంబానికి ఈ ఘోర విషాదాన్ని భరించే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని, మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థించారు.








