
గంధంగూడలో రియల్ మాయాజాలం ప్రభుత్వ భూమిపై కన్ను, ప్లాట్ల పేరిట కోట్లు లూటీ
ప్రజాప్రతినిధి అండ.. అధికారులు నిమ్మకు నీరెత్తిన వైఖరి
విజేత,రాజేంద్రనగర్ : రాజేంద్రనగర్ సర్కిల్ సర్వే నంబర్ 38లో దందా: గంధంగూడ డివిజన్ పరిధిలోని సర్వే నంబర్ 38 లో 3 ఎకరాల 30 గుంటల విస్తీర్ణంలో ఎలాంటి ప్రభుత్వ, లేఅవుట్ అనుమతులు లేకుండానే అక్రమంగా లేఅవుట్ ఏరియాలు ఏర్పాటు చేశారు.ప్రభుత్వ అనుమతులన్నీ ఉన్నాయంటూ నమ్మబలికి, గజం రూ.75 వేల చొప్పున విక్రయిస్తూ అమాయక కొనుగోలుదారుల నుండి కోట్లాది రూపాయలు గుంజుతున్నారు.
ప్రభుత్వ ఆదాయానికి గండి.
ఎలాంటి పన్నులు, రుసుములు చెల్లించకుండా భారీగా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ సొమ్ము చేసుకుంటున్నారు.
రాజకీయ అండదండలు.
అధికార పార్టీకి చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే ఈ అక్రమ దందా సాగుతోందని స్థానికులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోమంటే అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాజేంద్రనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సురేందర్ హెచ్చరిక.

ఈ వెంచర్లకు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవు. నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లు వేసి ప్లాట్లు విక్రయిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు.








