
హత్య అనంతరం కర్ణాటకకు పరారయ్యేందుకు ఆరాంఘర్ లో పోలీసులు ఛేజ్ చేసి మరీ అదుపులోకి
మొహమ్మద్ జావేద్‌తో పాటు మొహమ్మద్ అబ్దుల్లా, షేక్ ఆరిఫ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు
రూ.24 లక్షల చోరీ కేసులను ఛేదించిన పోలీసులు
విజేత,రాజేంద్రనగర్ : రాజేంద్రనగర్ నియోజకవర్గ మైలార్‌దేవ్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఇటీవల సంచలనం సృష్టించిన హత్య, భారీ చోరీ కేసులకు పోలీసులు తెరదించారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను వలపన్ని పట్టుకుని రిమాండ్‌కు తరలించారు.సెప్టెంబర్ 2న రవూఫ్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పాత కక్షలను మనసులో ఉంచుకున్న ప్రత్యర్థులు పక్కా స్కెచ్ వేశారు. బాధితుడు రవూఫ్‌ను అడ్డగించి, ఊపిరి సలపకుండా ఒక్కసారిగా కళ్లలో పెప్పర్ స్ప్రే చల్లారు. అతడు తేరుకునే లోపే కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి ప్రాణాలు తీశారు.ఈ కేసులో ప్రధాన నిందితుడు మొహమ్మద్ జావేద్‌తో పాటు మొహమ్మద్ అబ్దుల్లా, షేక్ ఆరిఫ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య అనంతరం కర్ణాటకకు పరారయ్యేందుకు ఆరాంఘర్ సమీపంలో వేచి చూస్తుండగా పోలీసులు ఛేజ్ చేసి మరీ అదుపులోకి








