
విజేత,మంత్రాలయం : మంత్రాలయం మండల కేంద్రానికి చెందిన వడ్డే సుజిత–మల్లికార్జున దంపతుల కుమార్తె, శ్రీ వైష్ణవి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న సూక్ష్మ కళాకారిణి ముకుంద ప్రియ తన ప్రతిభతో ఆకట్టుకుంటోంది.చాక్పీస్‌తో ఎంతో నైపుణ్యంగా శ్రీ రాఘవేంద్రస్వామి వారి చిత్రాన్ని రూపొందించి తన కళా ప్రతిభను చాటుకుంది. చిన్న వయసులోనే సూక్ష్మ కళలపై ఆసక్తి పెంచుకుని, అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్న ముకుంద ప్రియ ప్రతిభను పలువురు అభినందిస్తున్నారు.చాక్పీస్‌పై రాఘవేంద్రస్వామి వారి చిత్రాన్ని అత్యంత సూక్ష్మంగా, అందంగా చిత్రీకరించడం విశేషంగా నిలిచింది. ముకుంద ప్రియకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్థానికులు అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కళారంగంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు…..








