
విజేత,కృష్ణ : కృష్ణ మండలకేంద్రంలో మురహారి దొడ్డి గ్రామంలోని ఎల్ ఎఫ్ ఎల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈరణ్ణ పదవీ విరమణ పొందిన సందర్భంగా ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పి ఆర్ టి యు టి ఎస్ కృష్ణ మండల శాఖ మరియు మండల విద్యాశాఖాధికారి నిజాముద్దీన్ హాజరై ఈరణ్ణ కు శాలువా, మెమెంటో అందజేసి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఈరణ్ణ విద్యారంగంలో చేసిన సేవలు, విద్యార్థుల భవిష్యత్తు కోసం చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారని ప్రశంసించారు అనంతరం ఆయన సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో పదవీ విరమణ జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు నాయకులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.








