హైవే కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు పై కత్తితో దాడి చేసిన దుండగులు

విజేత,దేవరపల్లి : తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం జాతీయ రహదారిలో తెల్లవారుజామున హైవే కానిస్టేబుల్ పై గుర్తుతెలియ వ్యక్తులు దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. యర్నగూడెంలోని కనకదుర్గమ్మ గుడి సమీపంలో ఉన్న ఫ్లైఓవర్ పై రెండు లారీలు ఢీకొన్న విషయం తెలుసుకుని హైవే పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లారు. సమీపంలో ఉన్న బస్సు సెల్టర్ లో అనుమానస్పదంగా నలుగురు వ్యక్తులు ఉండటంతో హైవే కానిస్టేబుల్ వెంకటేశ్వరావు వాళ్ల వద్దకు వెళ్లి వివరాలు అడిగే ప్రయత్నం చేశారు.వాళ్లలో ఇద్దరు పారిపోగా మరో ఇద్దరు చాకుతో కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు పక్కటి ఎముకుల్లో రెండుసార్లు దాడి చేసి పరారయ్యారు.రక్త గాయాలైన వెంకటేశ్వరరావును ముందుగా దేవరపల్లి లో సుమంత్ హాస్పిటల్, మెరుగైన వైద్యం నిమిత్తం రాజ మహేంద్రవరం ప్రైవేట్ ఆస్పత్రి తరలించగా ఒక భాగంలో రెండు కుట్లు, మరో భాగంలో నాలుగు కుట్లు పడ్డాయాని ప్రాణాపాయం ఏమీ లేదని పోలీసులు తెలిపారు.ఇదే ప్రాంతంలో ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలోని రెండు హుండీల్లో చోరీ జరగడంతో స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.దాడి చేసిన వ్యక్తులను పట్టుకోవడంలో దేవరపల్లి పోలీసులు డ్రోన్ సహాయంతో నిందితులను గుర్తించే పనుల్లో నిమగ్నమయ్యారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :