
విజేత,దర్శి ప్రతినిధి: దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ కి జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం మంగళగిరి కేంద్ర టిడిపి కార్యాలయం నందు ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని అందజేసి అభినందించారు. పార్టీ పట్ల అచంచలమైన నిబద్ధత కలిగిన నేతగా.. విధేయతతో పనిచేస్తూ.. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, కార్యకర్తలకు నిరంతరం అండగా నిలవడంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ చేస్తున్న కృషి అభినందనీయమని సీఎం ప్రశంసించారు. “నేటి శిక్షణ పొందిన కార్యకర్తే.. రేపటి సమర్థ నాయకుడు” అనే లక్ష్యంతో పార్టీ శ్రేణులకు శిక్షణ అందిస్తూ, బలమైన నాయకత్వాన్ని క్షేత్రస్థాయిలో తీర్చిదిద్దేందుకు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న శిక్షణా తరగతుల్లో యూనిట్, క్లస్టర్ ఇన్చార్జ్లు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులకు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మార్గనిర్దేశం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, కార్యకర్తలను సమన్వయం చేయడం, ప్రజలకు పార్టీ సిద్ధాంతాలు – ప్రభుత్వ కార్యక్రమాలను చేరువ చేయడం వంటి అంశాలపై నాయకులకు దిశానిర్దేశం చేస్తూ ఆమె చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు.
* పార్టీ బలోపేతమే లక్ష్యంగా.. కార్యకర్తలకు అండగా..
క్షేత్రస్థాయిలో టీడీపీకి మరింత బలమైన పునాదులు వేస్తున్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ కి ముఖ్యమంత్రి చంద్రబాబు అందించిన ఈ ప్రశంస దర్శి నియోజకవర్గం లోని పార్టీ శ్రేణుల్లో, అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.








