‘శ్రీరామ” నామస్మరణతో ‘శ్రీరామ’హృదయకలశయాత్ర

విజేత,రాయికల్: ప్రతి మానవుడు భక్తితో భగవంతుడి నామస్మరణ చేస్తే హృదయంలో ఆధ్యాత్మిక చైతన్యం పెరిగి మానవులు శ్రీరాముడు చూపిన ధర్మమార్గంలో నడుస్తారని శ్రీ పరమహంస పరివ్రాజకా చార్యులు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజచిన్నజీయర్ స్వామి ఉద్భోదించారని వీరాపూర్ గ్రామంలో వికాసతరంగిణి బాధ్యులు అన్నారు.రాయికల్ మండలం వీరాపురంగ్రామానికి మంగళవారం శ్రీశ్రీశ్రీ రామానుజ చిన్న జీయర్ స్వామి 70 వ తిరునక్షత్ర మహోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న శ్రీరామహృదయ కలశ యాత్ర చేరుకుంది. ఈ కలశయాత్ర వీరాపుర్ గ్రామపంచాయతీ నుండిస్థానికఆంజనేయస్వామి దేవాలయం వరకు ధర్మప్రచారకర్త జవ్వాజి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో భక్తులు ‘జైశ్రీరామ్’ నామస్మరణలతో శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం ఆలయంలో శ్రీరామఅష్టోత్తర శతనామావళితో శ్రీరామ హృదయ కలశానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ జిల్లా సహకార్యవాహ అంగడి సాయి కృష్ణ మాట్లాడుతూ శ్రీ రాముని యొక్క ధర్మము ఆయన జీవితమును ఆదర్శంగా తీసుకొని నిత్యజీవితంలో ఆచరించాలన్నారు. ధర్మకర్త జవ్వాజి శ్రీనివాస్ మాట్లాడుతూ హిందువులు కులాలవారీగా, రాజకీయాల తో అనైక్యంగా ఉంటున్నారని, వాటిని రూపుమాపి సనాతన హిందూధర్మం కొరకు ఐక్యతగా ఉండటమే మన లక్ష్యం అని అన్నారు. అనంతరం భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దిండిగాల గంగు రామస్వామి, ఉప సర్పంచ్ దుంపల నర్సారెడ్డి ఆలయ కమిటీ అధ్యక్షులు నీలి మహేందర్,కనికరపుస్వామి, రాములు,సోమరాజు,మోతె ప్రదీప్,ధర్మరాజు,రమేష్ గుప్తా నారాయణ,అక్షయ్,నరేందర్ లచ్చన్న,లతా,లలిత,లావణ్య మమత,శ్రీలత,లావణ్య, మరియు సుమారు 200 మంది భక్తులతో పాటు గ్రామ నాయకులు వికాస తరంగణి బాధ్యులు వేల్పులస్వామి, గన్నవరంగంగాధర్,చిలకమర్రి శ్యాంసుందరచారి అర్చకుడు చెరుకుమధుసూదన్ పాల్గొన్నారు.