ఉత్తమ సేవకు గుర్తింపు…. ఆదర్శంగా నిలుస్తున్న శరణు బసప్ప

లైన్స్ క్లబ్ నుంచి జిల్లా యశోత్సవ్ అవార్డు

జిల్లా గవర్నర్ చేతి మీదగా ప్రధానం

విజేత,తాండూరు : తాండూరు లైన్స్ క్లబ్ అధ్యక్షులు శరణు బసప్పకు యశోత్సవ్ అవార్డు వరించింది.తాండూర్ లైన్స్ క్లబ్ ద్వారా జిల్లా వ్యాప్తంగా వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందిస్తున్న 2025 -26 వారికి అందించే ఈ అవార్డును జిల్లా గవర్నర్ మహేంద్ర కుమార్ రెడ్డి గురువారం ప్రకటించారు. ఉత్తమ ఆల్బమ్ ఐ క్యాంప్ అన్న ప్రసాదం పర్యావరణం క్లబ్ లో సభ్యుల జైనింగ్ ఉత్తమ అధ్యక్షుడిగా శరణకు కలిసి వచ్చిన అంశాలు వీరితో పాటు నల్ల దామోదర్ కూడా యశోత్సవ్ అవార్డును అందుకున్నారు. తాండూరు లైన్స్ క్లబ్ తరపున నియోజకవర్గ వ్యాప్తంగా వృద్ధులకు ఉచిత శిబిరాలు, విద్యార్థులకు, వృద్ధులకు, పలు రకాల సేవా కార్యక్రమం నిర్వహించారు.ఇందులో భాగంగా ఉత్తమ ఈ సందర్భంగా శరణు బసప్ప మాట్లాడుతూ… రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తానన్నారు. తనకు ఈ అవార్డు రావడానికి అహర్నిశలు తన వెన్నంటి ఉన్న తన తోటి లైన్స్ క్లబ్ సభ్యులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.