ఆచార్య జయశంకర్ ఆశయాలు భావితరాలకు స్ఫూర్తి 

చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి

తాండూరులో ఘనంగా జయంతి, నేతల నివాళులు

విజేత,తాండూరు : తెలంగాణ రాష్ట్ర సాధనకు స్థిరమైన బలాన్ని ఉద్యమ మేధావి, ప్రముఖ విద్యావేత్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి మున్సిపల్ కార్యాలయంలో చిత్రపటానికి.పట్టణంలో ఇందిరా చౌరస్తా వద్ద జయశంకర్ సార్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజబాల్ రెడ్డి మాట్లాడుతూ…. తెలంగాణ కోసం జీవితం అంకితభావం చేసిన మహానీయుడు. ఆచార్య జయశంకర్ అన్నారు. ఆయన అందించిన భావజాలం, చేసిన త్యాగాలు, చూపిన మార్గం భావితరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టి సమాజ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుల్లో ఆచార్య జయశంకర్ ఒకరని పేర్కొన్నారు. ఆయన సేవలను చిరకాలం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.