కాసం ఫ్యాషన్స్ షో రూమ్ ను ప్రారంభించిన సినీనటి అనసూయ భరద్వాజ్

తక్కువ రేటుకే నాణ్యమైన వస్త్రాలను అందిస్తున్న ఏకైక స్టోర్ కాసం ఫ్యాషన్స్… కాసం షాపింగ్ మాల్ డైరెక్టర్లు.

 

విజేత, ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మంచాల రోడ్డు బస్టాండ్ వద్ద కాసం ఫ్యాషన్స్ షోరూంను గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సినీనటి ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ హాజరై రూబెన్ కట్ చేసి షోరూమ్ ప్రారంభించి, జ్యోతి ప్రజ్వలన చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… అధునాతన కలెక్షన్స్ తో నిత్య నూతన వెరైటీ లతో కాసం ఫ్యాషన్స్ పేరు గాంచిందని అన్నారు. ఈ స్టోర్ ను ఇబ్రహీంపట్నంలో ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు. కాసం ఫ్యాషన్స్ లోని లేడీస్ జెంట్స్ కిడ్స్ వెర్ అంతా కలియతిరిగి సందడి చేసారు. ఇబ్రహీంపట్నం చుట్టు పక్కల ప్రాంత వాసులు షాపింగ్ కాసం ఫ్యాషన్స్ లో చేయాలని అన్నారు. కాసం షాపింగ్ మాల్ డైరెక్టర్లు కాసం నమశ్శివాయ, కాసం మల్లికార్జున్, కాసం కేదారినాథ్, కాసం శివప్రసాద్ మాట్లాడుతూ… తెలుగు రాష్ట్రాలలో గత 5 సంవత్సరాలుగా ప్రజల మన్ననలు పొందుతూ ఇప్పటివరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో 27 స్టోర్స్ ప్రారంభించాం అని అన్నారు. మా వస్త్రాలను ఎల్లప్పుడూ ఆదరిస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. అధునాతన ఫ్యాషన్ డిజైన్లను వినియోగదారులకు తక్కువ రేటుకే నాణ్యమైన వస్త్రాలను అందిస్తున్నామని తెలిపారు. తమ సంస్థ ద్వారా ఇబ్రహీంపట్నంలో స్థానికులకు నిరక్ష్యారాసులవారికి ప్రభుత్వ జాబ్ అవకాశం లేని వారికి 150 మందికి ఉపాధి కల్పిస్తున్నమన్నారు. సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా నమ్మకం లేదని తమ వద్ద సామాన్య వ్యక్తులకు కూడా ఉపాధి గ్యారంటీ అన్నారు. తొలుత సినీనటి అనసూయ భరద్వాజ్ ను చూడడానికి ఉదయం నుండి అభిమానులు, పరిసర ప్రాంత యువతి, యువకులు బారులు తీరారు. యువతి యువకుల కేరింతలతో కాసం షాపింగ్ మాల్ ప్రాంతంలో పండగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో పుల్లూరు అరుణ్ కుమార్, విశాల్, వరుణ్, అరుణ్, కార్తీక్, కాసం ఫణిత్, కాసం సాయికృష్ణ, యాంసాని ప్రవీణ్ తో పాటు ప్రముఖులు పాల్గొన్నారు.

 

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :