చెత్త డబ్బాలు, గ్రీనరీ ఏర్పాటు చేయాలని మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండారి శంకర్ డిమాండ్

*శిశుమందిర్ స్కూలు దారిలో చెత్త కుప్పలు పిల్లల అవస్థలు చూడండి సారూ*  

*చెత్త డబ్బాలు, గ్రీనరీ ఏర్పాటు చేయాలని మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండారి శంకర్ డిమాండ్*

  1. *విజేత రాజేంద్రనగర్*

రాజేంద్రనగర్ సర్కిల్ జీహెచ్ఎంసీ పరిధిలోని శివరాంపల్లి గ్రామం సమీపంలో శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలకు వెళ్లే రహదారి చెత్తమయంగా మారింది. ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తుండడంతో స్కూలుకు వెళ్లే చిన్నారులు, వారి తల్లిదండ్రులు మురికి వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

 ముక్కు మూసుకుని వెళ్లాల్సిన దుస్థితి

పాఠశాల మార్గంలో చెత్త కుప్పలు పేరుకుపోవడంతో దుర్వాసనతో పాటు దోమలు, ఈగల బెడద పెరిగింది. పిల్లలను స్కూలులో దింపేందుకు వచ్చే పేరెంట్స్ ముక్కు మూసుకుని వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

*అధికారులు స్పందించాలి: బండారి శంకర్*

ఈ సందర్భంగా గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండారి శంకర్ మాట్లాడుతూ, “స్కూలు దారిలో చెత్తతో స్థానికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు ఇటువైపు కాస్త కన్నెత్తి చూడాలి. వెంటనే ఇక్కడ పెద్ద చెత్త డబ్బాలను ఏర్పాటు చేయాలి” అని డిమాండ్ చేశారు.

*గ్రీనరీ ఏర్పాటు చేయండి*

చెత్తకు బదులు స్కూలుకు వెళ్లే దారిలో గ్రీనరీ ఏర్పాటు చేస్తే పిల్లలకు ఆహ్లాదకరంగా ఉంటుంది. స్వచ్ఛమైన వాతావరణంలో విద్యార్థులు స్కూలుకు వెళ్తారు. జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి రోడ్డుపై చెత్త తొలగింపు వాహనాలు రోజూ రాకపోవడంతోనే ఈ సమస్య తలెత్తుతోందని స్థానికులు చెబుతున్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని అని బండారి శంకర్ విజ్ఞప్తి చేశారు.. శివరాంపల్లి శిశుమందిర్ స్కూలు దారిలో పేరుకుపోయిన చెత్తను పరిశీలిస్తున్న గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండారి శంకర్.

 

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :