షాబాద్ మండల నూతనంగా ఎన్నుకోబడిన వార్డు సభ్యుల కమిటీ

విజేత,రంగారెడ్డి: చేవెళ్ల నియోజకవర్గం,షాబాద్ మండలం, లోని ఈ కార్యక్రమం ముఖ్యఅతిథిగా రంగారెడ్డి జిల్లా, వార్డు మెంబర్స్ పోరం ఇంచార్జ్ గ్యార సురేష్, ఆధ్వర్యంలో మండల వార్డు సభ్యుల ఫోరంను షాబాద్,ముదిరాజ్ భవన్ లో ఎన్నుకోవడం జరిగింది. వార్డు సభ్యుల కమిటీ మండల అధ్యక్షుడిగా గంధం శ్రీనివాస్ ముదిరాజ్, ఉపాధ్యక్షులుగా ఒగ్గు సుమతమ్మ మల్లేష్ కురుమ,కో ఇన్చార్జి డి మల్లేష్,గౌరవ అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి యాదగిరి,వర్కింగ్ ప్రెసిడెంట్ గా రమేష్ గౌడ్,కార్యదర్శిగా చంద్రశేఖర్,జంగయ్య,నరేందర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వార్డు సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :