
విజేత, పాపన్నపేట : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వనదుర్గాభవాని మాత అమ్మవారి సన్నిధిలో 12 కాటేజీల నిర్మాణానికి రూ.7 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ తెలంగాణ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్ జీవో ఆర్టి నెంబర్ 193 తేదీ 29.06.2026 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ అవసరాలు ఎకో ఫ్రెండ్లీ ద్వార 12 కాటేజీలను ఏడుపాయలలో నిర్మించడానికి నిధులను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా టూరిజం శాఖ మేనేజింగ్ డైరెక్టర్ ను ఆదేశించారు.







