అంగరంగ వైభవంగా సూర్యగిరి ఎల్లమ్మ బోనాల జాతర

– హాజరైన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క.

– భక్తజన సంద్రంగా మారిన సూర్యగిరి దేవాలయ పరిసరాలు.

– సూర్యగిరి ఎల్లమ్మ దేవాలయం చైర్మన్ రెడ్డిగల్లా రత్నం.

విజేత, ఇబ్రహీంపట్నం : సూర్యగిరి ఎల్లమ్మ బోనాల జాతర, అమ్మవారి ఘటం ఊరేగింపు మంగళవారం రాత్రి భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక సందడితో అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో సూర్యగిరి పరిసరాలు భక్తజన సంద్రంగా మారాయి. ఆలయ ధర్మకర్తలు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. బోనాల సందర్భంగా శివసత్తుల ప్రత్యేక వేషధారణలో ఆటలు, పాటలతో అలరించగా.. డప్పు దరువులు, మేళతాళాల నడుమ భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి బట్టి విక్రమార్క హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు సంప్రదాయబద్ధంగా బోనాలు ఎత్తుకుని ఆలయానికి చేరుకుని ఎల్లమ్మ తల్లికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో ఆలయ పరిసరాల్లో భక్తి పారవశ్యం వెల్లివిరిసింది. ఈ సందర్బంగా దేవాలయం చైర్మన్ రెడ్డిగల్లా రత్నం మాట్లాడుతూ… భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. సుమారు 300 మంది పోలీసు సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి జాతర మొత్తం నిరంతరం పర్యవేక్షించారు. భక్తుల రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంతో పాటు, వాహనాల కోసం విశాలమైన పార్కింగ్ సదుపాయం కల్పించాము. జాతర ప్రాంగణం, ఆలయ పరిసరాలు, పార్కింగ్ ప్రాంతాలు, ప్రధాన రహదారుల వద్ద పోలీసు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా భద్రతను పర్యవేక్షించారు. ఆలయ ధర్మకర్తలు, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయడంతో ఎల్లమ్మ బోనాల జాతర ప్రశాంతంగా, విజయవంతంగా జరిగింది. దీంతో భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఆలయ నిర్వాహకులు, పోలీసు అధికారులకు అభినందనలు తెలిపారు అన్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :