ఉత్తరాంధ్ర నేతలతో వైఎస్ జగన్ ప్రత్యేక సమావేశం




ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర‎పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. పరిపాలనా రాజధానిగా విశాఖను ప్రకటించిన తర్వాత ఉత్తరాంధ్రలో మళ్ళీ తిరిగి పాగవేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగా 2019 ఫలితాలకు ఏమాత్రం తగ్గకుండా త్వరలో జరగబోయే ఎన్నికల్లో విజయం సాధించేలా అడుగులు వేస్తోంది. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ఉత్తరాంధ్ర జిల్లాల 34 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జిగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి.. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. సీఎం  అధ్యక్షత వహించారు.ఈ సమావేశంలో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గంలో అనుసరించాల్సిన వ్యూహాలు, పోల్ మేనేజ్మెంట్, ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలు, నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఉన్న పార్టీ పరిస్థితి ఏంటి, నియోజకవర్గంలో సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. ఇక ఎన్నికల్లో మూడు పార్టీలు ఏకమై వస్తున్న నేపథ్యంలో ఆయా నియోజకవర్గంలో పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనే దానిపై దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటన ముగిసిన నేపథ్యంలో అభ్యర్థులంతా నియోజకవర్గాల్లో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు.

ఇప్పటికే నియోజకవర్గాలకు సంబంధించి సమన్వయకర్తలే దాదాపుగా అభ్యర్థుల జాబితా ఉండే అవకాశం ఉందని అందులో భాగంగానే ప్రత్యేకంగా వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఎమ్మెల్యేలతో సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశం తరువాత ఇకపై ఉత్తరాంధ్ర జిల్లాల్లో మార్పులు ఉండబోవని సమావేశానికి హాజరైన వారే దాదాపు అభ్యర్థులనే సంకేతాలను బలంగా ప్రజల్లోకి తీసుకుళ్లే ప్రయత్నం చేసింది. ఉత్తరాంధ్రపై వైసీపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడానికి ప్రధాన కారణం.. తెలుగుదేశం పార్టీ బలంగా ఉందన్న ప్రచారానికి చెక్ పెట్టడం కోసమని అంటుంది వైసిపి అధిష్టానం. పరిపాలన రాజధానిగా విశాఖపట్టణాన్ని ప్రకటించిన నాటి నుంచి ఏపీ రాజకీయం మొత్తం ఉత్తరాంధ్ర ,అమరావతి కేంద్రంగా తిరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసిపి అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని నిరోధించేలా చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లాలని సజ్జలరామకృష్ణా రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఆ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.


 

 


Latest News
more

Trending
more