ఎన్నికలకు సిద్ధమంటూ ప్రత" /> ఎన్నికలకు సిద్ధమంటూ ప్రత">


నేడు వైసీపీ చివరి 'సిద్ధం' సభ - కీలక ప్రకటన ఉండనుందా..?




ఎన్నికలకు సిద్ధమంటూ ప్రతిపక్షాలకు సవాల్ విసురుతోంది వైసీపీ. ఇప్పటికే మూడు భారీ సభలను నిర్వహించగా…. ఇవాళ మేదరమెట్ల వేదికగా ఆఖరి సిద్ధం సభను నిర్వహించనుంది. ఈ వేదిక నుంచి ఆ పార్టీ అధినేత జగన్ కీలక ప్రకటన చేేసే అవకాశం ఉంది.రాబోయే జరగనున్న ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ… సిద్ధం పేరుతో భారీ సభలను నిర్వహిస్తోంది వైసీపీ. ఉత్తరాంధ్ర గడ్డపై తొలి సభను నిర్వహించి విజయవంతం చేసింది. ఆ తర్వాత మరో రెండు భారీ సభలను నిర్వహించింది. ఇదే క్రమంలో…. ఇవాళ బాపట్ల జిల్లా పరిధిలోని మేదరమెట్ల వేదికగా ఆఖరి 'సిద్ధం' సభను(YSRCP Siddham Meeting) తలపెట్టింది. ఇవాళ్టితో వైసీపీ చేపట్టిన ఈ సిద్ధం సభలు పూర్తి కానున్నాయి. 

ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని… భారీ విజయాన్ని అందుకునేందుకు నడుంబిగించాలని పిలుపునిస్తోంది వైసీపీ. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ తన ప్రసంగాలతో క్యాడర్‌ లో జోష్ నింపే ప్రయత్నం చేస్తూ…. కార్యకర్తలను సంసిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ నాలుగో సిద్ధం బహిరంగ సభను తలపెట్టింది. ఇందుకు వైఎస్ జగన్(YS Jagan) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. దక్షిణ కోస్తాలోని నియోజకవర్గాల కేంద్రంగా ఈ సభ జరగనుంది.

గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని నియోజకవర్గాల నుంచి కార్యకర్తలను తరలిస్తోంది వైసీపీ. చివరి సిద్ధం సభను విజయవంతం చూసి ప్రతిపక్ష పార్టీలకు మరోసారి గట్టి సవాల్ విసరాలని చూస్తోంది. భీమిలి, దెందులూరు, రాప్తాడులో నిర్వహించిన సభలకు మించి జన సమీకరణ చేస్తోంది వైసీపీ. దాదాపు 44 నియోజకవర్గాల నుంచి కేడర్ ను తరలించనుంది.

కీలక ప్రకటన ఉంటుందా…?

చివరి సిద్ధం సభ వేదిక నుంచి కీలక ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా మేనిఫెస్టోకు(Ysrcp Manifesto 2024) సంబంధించి ఆ పార్టీ అధినేత జగన్ ప్రకటన చేస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ గత మేనిఫెస్టోలో సంక్షేమ పథకాలకే(Welfare Schemes) పెద్ద పీట వేసిది. చాలా సింపుల్ గా ప్రజలకు సులభంగా చేరేలా ఉండే వైసీపీ మేనిఫెస్టో కూడా గత ఎన్నికల్లో విజయానికి ఒక కారణమని విశ్లేషకులు అంటారు. ఇదే తరహాలో ఈసారి కూడా వైసీపీ మేనిఫెస్టో ఉండనుందని సమాచారం. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి మార్గాలకు ఈసారి మేనిఫెస్టోలో ప్రాథాన్యత ఇస్తారని తెలుస్తోంది. ఉద్యోగ నోటిఫికేషన్లు, ఉపాధి అవకాశాలతో పాటు పేద, మధ్యతరగతి ప్రజలకు ఊతం అందించే సంక్షేమ పథకాలు మేనిఫెస్టోలు ఉండే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుత సంక్షేమ పథకాలు కొనసాగింపుతో పాటు కొత్త పథకాలు ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో ఎదురైన అనుభవాలతో మేనిఫెస్టో రూపొందించామని గతంతో వైసీపీ తెలిపారు. ఈసారి కూడా అదే తరహాలో మెరుగైన మేనిఫెస్టో రూపొందించేందుకు వైసీపీ అధిష్టానం కసరత్తు చేసినట్లు సమాచారం.

జగన్ స్పీచ్ పై ఆసక్తి….

ఏపీలో మరోసారి తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ (NDA Allaince in AP 2024) చేయనున్నాయి. అధికారికంగా కూటమి కూడా ఖరారైంది. ఈ నేపథ్యంలో సిద్ధం సభలో ప్రసంగించినున్న వైసీపీ అధినేత జగన్…. ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే టీడీపీ, జనసేన పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న జగన్…. బీజేపీపై కూడా విమ్శనాస్త్రాలను ఎక్కుబెడుతారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.


Latest News
more

Trending
more