ఘోర పరాజయంతో నాలుగో స్థానానికి పడిపోయిన టీమిండియా!




చెన్నై వేదికగా జరిగిన మొదటి టెస్టులో టీమిండియా 227 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓటమి చవి చూసింది. ఈ పరాజయంతో వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్స్ అవకాశాలను టీమిండియా క్లిష్టం చేసుకుంది. తాజాగా ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్ లో 70.2 శాతంతో ఇంగ్లాండ్ జట్టు అగ్రస్థానంలో ఉంది. ట్రోఫీలో భాగంగా ఇప్పటివరకు 6 సిరీస్ లలో 18 మ్యాచులు ఆడింది. 442 పాయింట్లు (11 విజయాలు, 4 ఓటములు, 3 డ్రా)లతో ఇంగ్లాండ్ నెంబర్ 1 స్థానానికి చేరుకుంది. రెండవ స్థానంలో న్యూజిలాండ్ ఉంది. 5 సిరీస్ లలో కివీస్ జట్టు 11 మ్యాచులు ఆడింది. 70.0 శాతంతో 420 పాయింట్లు ( 7 విజయాలు, 4 ఓటములు) రెండవ స్థానంలో ఉంది. ఇక మూడవ స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. 

ఆస్ట్రేలియా 4 సిరీస్ లలో 14 మ్యాచులు ఆడింది. 69.2 శాతంతో 332 పాయింట్లు ( 8 విజయాలు, 4 ఓటములు, 2 డ్రా)లతో మూడవ స్థానంలో ఉంది. ఇక టీమిండియా నాలుగవ స్థానంలో ఉంది. 430 పాయింట్ల పరంగా టాప్ లోనే ఉన్నా టీమిండియా విజయాల శాతం 68.3 మాత్రమే దీంతో టీమిండియా ర్యాంకింగ్స్ లో పడిపోయింది. ఇప్పటి వరకు 6 సిరీస్ లు ఆడిన టీమిండియా 14 మ్యాచులలో (9 విజయాలు, 4 ఓటములు, 1 డ్రా)తో నాలుగవ స్థానానికి చేరుకుంది. ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్స్ చేరే అవకాశాలను టీమిండియా సంక్లిష్టం చేసుకుంది.  ఈ సిరీస్ లో రెండు టెస్టులు గెలిస్తే టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్స్ బెర్తును టీమిండియా ఖరారు చేసుకుంటుంది. 


Latest News
more

Trending
more