పెట్రోల్, మద్యం ధరలు పెరగవు.. స్పష్టం చేసిన కేంద్రం




ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం బడ్జెట్ ప్రసంగంలో పెట్రోల్, డీజిల్, మద్యం సహా కొన్ని వస్తువులపై అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలెప్‌మెంట్ సెస్ (ఏఐడీసీ) పేరుతో సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. పెట్రోలుపై రూ. 2.50 పైసలు, డీజిల్‌పై రూ. 4 చొప్పున సెస్ విధిస్తున్నామని చెప్పారు. మరోవైపు ఫారిన్ లిక్కర్‌పై 100 శాతం సెస్ విధిస్తున్నట్లు చెప్పారు. దీంతో ఇంధనం, మద్యం ధరలకు రెక్కలు వచ్చినట్లేనని అందరూ భావించారు. ముఖ్యంగా సామాన్యులు ఉపయోగించే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంపై ఆందోళన చెందారు.

కాగా, పెరిగిన సుంకాల భారం ప్రజలపై పడబోదని కేంద్ర స్పష్టం చేసింది. పెట్రోల్, డీజిల్‌పై బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ (బీఈడీ), స్పెషలన్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (ఎస్ఏఈడీ)ని తగ్గిస్తున్నట్లు పేర్కొన్నది. పెట్రోలుపై బీఈడీని రూ. 2.98 నుంచి రూ. 1.40కి, ఎస్ఏఈడీని రూ. 12 నుంచి రూ. 11కి తగ్గించనున్నట్లు తెలిపారు. అలాగే డీజిల్‌పై బీఈడీని రూ. 4.83 నుంచి రూ. 1.80కి, ఎస్ఏఈడీని రూ. 9 నుంచి రూ. 8కి తగ్గిస్తున్నామని చెప్పారు. దీంతో సెస్ ద్వారా పెరిగిన ధర ఈ తగ్గింపుల ద్వారా గత రేటుతోనే ఉంటుందని స్పష్టం చేసింది.

మరోవైపు మద్యంపై 100 శాతం ఏఐడీఎస్ విధిస్తున్నట్లు తెలిపింది. అదే సమయంలో 150 శాతం ఉన్న కస్టమ్స్ సుంకాన్ని 50 శాతానికి తగ్గించారు. దీంతో ధరల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని తెలిపింది.


Latest News
more

Trending
more