స్త్రీ ఎక్కడ గౌరవించపడుతుందో అక్కడ సకల దేవతలు నిలయమై ఉంటారు




స్త్రీ ఎక్కడ గౌరవించపడుతుందో అక్కడ సకల దేవతలు నిలయమై ఉంటారు
---అర్బన్ ఎమ్మెల్యే

అక్షర విజేత, నిజామాబాద్ సిటీ : స్త్రీ ఎక్కడ గౌరవించపడుతుందో అక్కడ సకల దేవతలు నిలయమై ఉంటారని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనార్యాయణ పేర్కొన్నారు. గురువారం నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో మహిళా శిశు, దివ్యంగుల, వయోవృద్దుల శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యత్య నార్యంతు పూజంతే రామంతు తత్ర దేవత అంటు ఎక్కడైతే స్త్రీలు గౌరవించపడతారో అక్కడ సకల దేవతలు నిలయమై ఉంటారని, స్త్రీ లేకపోతే జననం లేదని, స్త్రీ లేకపోతే గమనం లేదని, స్త్రీ లేకపోతే ఈ సృష్టి లేదని, గమనం, జననం, సృష్టి ఉండాలంటే స్త్రీ ఉండాలని అన్నారు. స్త్రీని గౌరవించి పూజించే ఏకైక దేశం భారత దేశం అని, ఈ దేశాన్ని భారత మాత అంటూ అమ్మల చూసుకుంటామని అన్నారు. ఒకప్పుడు వంటింటికి పరిమితం అయిన మహిళలు, ఈ రోజు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా దూసుకుపోతున్నారని అన్నారు, స్వతంత్ర సమరంలో కూడా ఎందరో వీర వనితలు తమ ప్రాణాలను అర్పించారాని, ఝాన్సీ లక్ష్మి భాయ్, రాణి రుద్రమ్మ లాంటి వీర వనితలు మనకు ఆదర్శం అని, మహిళా శక్తి జాతీయ శక్తి అని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి) మహిళలకు పెద్ద పీఠ వేసిందని అన్నారు. ఒక సామాన్య గిరిజన మహిళను రాష్ట్రపతి చేసిన ఘనత బిజెపిది అన్నారు. మహిళల ఏళ్ల నాటి కల మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా అమలు చేసిన పార్టీ బిజెపి అని, మైనారిటీ ఆడబిడ్డల జీవితాలకు భరోసాగా త్రిబుల్ తలాక్ రద్దు చేసింది కూడా బిజెపి ప్రభుత్వమే అని అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ గత పదేళ్లలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని, మహిళల అభివృద్ధి, సాధికారత కోసం విశేషంగా కృషి చేసారని అన్నారు. అందులోనే భాగంగా ఉజ్వల యోజన, స్వచ్ భారత్, సుకన్య సమృద్ధి యోజన, ముద్ర లోన్స్, జన్ దన్ ఖాతాలు, అవస్ యోజన ఇలా అనేక పథకాలు తీసుకురావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, మేయర్ నీతుకిరణ్, కిరణ్ మయి ట్రైన్ ఐఏఎస్, రసూల్ భీ జిల్లా సంక్షేమ అధికారి, నిరజరెడ్డి అడ్వకేట్ లోకల్ కమిటీ, వసుంధర, కృష్ణవేణి జిల్లా మైనారిటీ అధికారి,  జ్యోతి సిద్దయ్య స్నేహ సొసైటీ, సంపూర్ణ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, చైర్ పర్సన్, మహిళా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
 


Latest News
more

Trending
more