దెబ్బకు దిగొచ్చిన వాట్సప్




ప్రముఖ వ్యక్తిగత మెసేజింగ్ యాప్ వాట్సప్ ఎట్టకేలకు దిగొచ్చింది. ఇటీవల తమ ప్రైవసీ పాలసీని మారుస్తున్నట్లు వాట్సప్ అందరినీ దానికి ఒప్పుకోవాలంటూ మెసేజీలు పంపింది. ఒకవేళ ఆ ప్రైవసీ పాలసీ అమలు చేస్తే.. తమ వినియోగదారుల డేటాను థర్డ్ పార్టీకి ఇచ్చే అవకాశం ఏర్పడేది. అంతే కాకుండా వినియోగదారుల మెజేసీలు చదవడం, ఫోన్ డేటాను తీసుకోవడం, ఆఖరుకు లొకేషన్, బ్యాటరీ వినియోగాన్ని కూడా ఉపయోగించుకోవడం జరిగేది.

వాట్సప్ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు ఆగ్రహం చెందారు సిగ్నల్, టెలిగ్రామ్‌కు మారిపోయారు. దీంతో వాట్సప్ నష్టనివారణ చర్యలకు సిద్దమైంది. ఆదివారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారులకు వాట్సప్ స్టేటస్‌లో పలు విజ్ఞప్తులు చేసింది.  ‘మేము మీ వ్యక్తిగత భద్రతకు కట్టుబడి ఉన్నాం. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ విధానం వల్ల వాట్సప్ మీ పర్సనల్ మెసేజ్ లను చదవదు. మీరు షేర్ చేసే లొకేషన్ వివరాలు చూడదు. మీ కాంటాక్ట్స్ కూడా ఫేస్ బుక్‌తో పనంచుకోదంటూ’ తమ యూజర్స్ కు అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. దీన్ని చూసి వాట్సప్ ఎట్టకులకు దిగొచ్చిందని వినియోగదారులు అనుకుంటున్నారు.


Latest News
more

Trending
more