విమర్శలు వెల్లువెత్తడంతో మెట్టు దిగిన వాట్సాప్




సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ తమపై వస్తున్న ఒత్తిడికి తలొగ్గింది. ప్రైవసీ నిబంధనలు బిజినెస్ అకౌంట్ లకు మాత్రమే వర్తిస్తాయని  ఓ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల వాట్సాప్ తమ ఫీచర్స్ లలో మార్పులు చేస్తూ ప్రైవసీ నిబంధనలను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మనం పంపే సమాచారం పూర్తి రహస్యంగా ఉండబోదనే చర్చ జరుగుతోంది.  డెలివరీ అయ్యే సమాచారాన్ని వాట్సాప్ తమ మాతృ సంస్థ ఫేస్బుక్ తో కూడా పంచుకోనుందని వార్తలు రావడంతో ఆందోళన నెలకొంది. మనం పంపించే సమాచారాన్ని థర్డ్ పార్టీ మానిటరింగ్ చేస్తుందని తెలియడంతో వాట్సాప్ తీసుకున్న ఈ నిర్ణయంపై  ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఇప్పటికే కోట్లాది మంది వాట్సాప్ ను తమ ఫోన్ నుంచి డిలీట్ చేశారు.

వాట్సాప్ కు బదులుగా 'సిగ్నల్', 'టెలిగ్రామ్' యాప్ లను యూజర్స్ డౌన్లోడ్ చేస్తున్నారు. ప్రజలు తమ యాప్ ను డిలీట్ చేస్తుండటంతో పాటు విమర్శలు వస్తుండటంతో వాట్సాప్ సంస్థ మెట్టు దిగవలసి వచ్చింది.  తమ ద్వారా డెలివరీ అయ్యే మెసేజ్ లు 100 శాతం సురక్షితమని  ప్రకటనలో తెలిపింది. దీనిపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని యూజర్స్ ను కోరింది. ఏ సమాచారాన్ని కూడా ఫేసుబుక్ తో పంచుకోమని స్పష్టం చేసింది. ఇదే సమయంలో  ప్రైవేటు మెసేజ్ లను థర్డ్ పార్టీ చూస్తుందని కాల్స్ ను కూడా వింటుందని జరుగుతున్న ప్రచారం అవాస్తమని తేల్చిన సంస్థ ఎప్పటిలాగే అవి సురక్షితమని తేల్చి చెప్పింది. కాల్ లాగ్స్ మాత్రం తాము భద్రపరుస్తామని స్పష్టం చేసింది. యూజర్స్ కోసం డిలీట్ ఆప్షన్ కూడా తాము కల్పిస్తామని అది వాడుకోవచ్చని సలహ ఇచ్చింది. ఫేస్బుక్ తమ మాతృ సంస్థ అయినా వాట్సాప్ స్వతంత్రంగా వ్యవహరిస్తుందని తెలిపింది. బిజినెస్ ఖాతాలకు సంబంధించిన సమాచారంపైనే పాలసీ నిబంధనల ప్రభావం ఉంటుందని పర్సనల్ వాట్సాప్ లకు ఈ నిబంధనలు వర్తించవని తెలిపింది. 
 


Latest News
more

Trending
more