కొరియన్ యువతి నోట... సారంగ దరియా పాట -వీడియో వైరల్




తెలుగు సినిమా పాటలను దేశంలోని ఇతర రాష్ట్రాల వాళ్ళే కాక విదేశీయులు కూడా ఇస్హ్తపడతారు. అనేక తెలుగు పాటలను పాడిన విదేశీయులున్నారు. మన పాటలకు డ్యాన్సులు చేసి వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విదేశీ క్రికెటర్లున్నారు. సంగీతానికి సరిహద్దులు లేవని చాటి చెప్తూనే ఉంటారు మానవులు.

ఇప్పుడు మరో తెలుగు పాట ఓ కొరియన్ యువతి పాడి సంచలనం సృష్టించింది. శేఖర్ కమ్ముల తీసిన లవ్ స్టోరీ మూవీలోని సారంగ దరియా సాంగ్ ఇక్కడ ఎంత హిట్టయ్యిందో తెలిసిందే. నాగ చైతన్య, సాయిపల్లవి నటించిన ఈమూవీలోని సారంగధర పాటను అశోక్ తేజ రాయగా మంగ్లీ పాడారు. జానపశైలిలో సాగే ఆ పాటను ఇప్పుడు ఓ కొరియన్ యువతి పాడగా యూట్యూబ్ లో లక్షల వ్యూస్ తో దూసుకపోతోంది. ఈ వార్త రాసే సమయానికి యూట్యూబ్ లో ఆ వీడియో కు వచ్చిన వ్యూస్ 8,71,754. 


Latest News
more

Trending
more