నిఫ్టీలో సాంకేతిక లోపం..నిలిచిపోయిన ట్రేడింగ్




నేషనల్‌ స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌  ట్రేడింగ్‌ నిలిచిపోయింది. సాంకేతిక లోపం కారణంతో ట్రేడింగ్ నిలిచిపోయినట్లు నిఫ్టీ ప్రకటన చేసింది. దీంతో అన్ని రంగాల్లో ట్రేడింగ్‌ను ఉదయం 11:40 గంటల నుంచి నిలిపివేస్తున్నట్లు ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ఎక్స్‌ఛేంజ్‌కి రెండు టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్లు సేవలు అందిస్తున్నాయని.. వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. సమస్య పరిష్కారం అయిన వెంటనే ట్రేడింగ్‌ను పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు.

ట్రేడింగ్‌ ఆగిపోయే సమయానికి నిఫ్టీ 112 పాయింట్ల లాభంతో 14,820 వద్ద కొనసాగుతుంది. సెన్సెక్స్ మాత్రం ఎటువంటి అడ్డంకి లేకుండా కొనసాగుతోంది. ట్రేడింగ్ లో ప్రైస్ రేట్స్ కనబడకపోవడంతో షేర్ హోల్డర్స్ హైరానా పడ్డారు. దీంతో రంగంలోకి దిగిన నిఫ్టీ అధికారులు ట్రేడింగ్ నిలిచిపోయినట్లు ప్రకటించడమే కాకుండా  ట్రేడింగ్‌ను పునరుద్ధరిస్తామని ఓ ప్రకటన చేసింది. 
 


Latest News
more

Trending
more