మళ్లీ భయపెట్టేందుకేనా?




ప్పుడంతా ఫ్రాంచైజీ సినిమాల జమానానే! ఒక సినిమా ఘన విజయం సాధిస్తే.. అయితే సీక్వెల్‌తో ఆ సక్సెస్‌ను కొనసాగిస్తున్నారు. అందుకు అవకాశం లేకపోతే ఫ్రాంచైజీ ఫార్ములాను ఎంచుకుంటున్నారు దర్శక, నిర్మాతలు.

'చంద్రముఖి' సినిమాకు రీమేక్‌ వెర్షన్‌గా బాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించిన సినిమా 'భూల్‌ భులయ్యా'. 2007లో విడుదలైన ఈ సినిమాలో అక్షయ్‌ కుమార్‌, విద్యాబాలన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. 'చంద్రముఖి' డైరెక్టర్‌ ప్రియదర్శన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

ఈ చిత్రానికి ఫ్రాంచైజీ హోదా కట్టబెట్టి 15 ఏండ్ల తర్వాత అనీస్‌ బజ్మీ దర్శకత్వంలో 'భూల్‌ భులయ్యా 2' విడుదలైంది. టబు, కార్తిక్‌ ఆర్యన్‌, కియారా అడ్వాణి నటించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర మంచి కలెక్షన్లు రాబట్టింది. రెండో సినిమా కూడా హిట్‌ కావడంతో మూడో ప్రయత్నానికి ముహూర్తం కుదిరింది. ఇందులో కార్తిక్‌ ఆర్యన్‌ హీరోగా నటిస్తున్నాడు. మాధురీ దీక్షిత్‌, విద్యాబాలన్‌ ఈ ప్రాజెక్టులో భాగమవ్వడంతో సెట్స్‌కు చేరకముందే దీనిపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. నవంబర్‌లో సినిమాను విడుదల చేస్తామని ప్రొడక్షన్‌ టీమ్‌ చెబుతున్నది. 'భూల్‌ భులయ్యా 3' ప్రేక్షకులను ఎంతలా అలరిస్తుందో చూడాలి!


 


Latest News
more

Trending
more