ఒకే సారి 1000 మందితో వీడియో కాల్ - కొత్త ఫీచర్ తీసుక వచ్చిన టెలిగ్రామ్




 

ఇప్పటి వరకు మెసేజింగ్ యాప్ Whatsapp వాట్సప్ కు సరైన పోటీ లేదనే చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది యూజర్లతో వాట్సప్ దూసుకపోతోంది. అయితే వాట్సప్ కొత్తగా తీసుక వచ్చిన ప్రైవసీ పాలసీ యూజర్లను దూరం చేస్తోంది. మరొక మెసేజింగ్ యాప్ కోసం చూస్తున్న యూజర్లు ఈ మధ్య కాలంలో ఎక్కువగా Telegram టెలిగ్రామ్ అనే మెసేజింగ్ యాప్ వైపు టర్న అవుతున్నారు. టెలిగ్రామ్ కూడా తన కొత్త అప్డేట్ల ద్వారా యూజర్లను ఆకర్షిస్తోంది. 

ఇప్పుడు టెలీగ్రామ్ తీసుకవచ్చిన నూతన అప్డేట్ యూజర్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఏ మెసేజింగ్ యాప్ లో లేనివిధంగా ఇప్పుడు టెలీగ్రామ్ లో ఒకే సారి 1000 మంది video call వీడియో కాల్ మాట్లాడుకునే వీలు కల్పించింది. ఈ కరోనా కాలంలో సభలు, సమావేశాల కోసం ప్రజలు ఆన్ లైన్ వీడియో కాన్ఫరెన్స్ ల మీదనే ఆధారపడుతున్నారు. పైగా స్కూళ్ళు, కాలేజీలు ఆన్ లైన్ క్లాసులకే ప్రిఫరెన్స్ ఇస్తున్నాయి. దాంతో ఇప్పుడు టెలీగ్రామ్ తీసుకవచ్చిన ఈ కొత్త ఫీచర్ చాలా మంది కొత్త యూజర్లను ఆకర్షిస్తుందని టెలీగ్రామ్ యాజమాన్యం భావిస్తోంది. 

వేయి మందితో వీడియో కాన్ఫరెన్స్ ఫీచర్ మాత్రమే కాకుండా వీడియోలు షేర్ చేసే కొత్త అప్డేట్ ను కూడా తీసుకవచ్చింది టెలీగ్రామ్. ఈ కొత్త ఫీచర్ల‌ వల్ల ఇక వాట్సప్ హవా తగ్గి టెలీగ్రామ్ ముందుకు దూసుకపోయే అవకాశం ఉందా అనేది వేచి చూడాలి. 


Latest News
more

Trending
more