టాటాల బంపర్ ఆఫర్.. ఈ కార్లపై రూ.85 వేల తగ్గింపు.. ఆఫర్ కొద్దిరోజులే!




మీరు కొత్త కారు కొనాలనుకుంటున్నారా? అయితే, ఇది మీకోసమే. దేశీయ దిగ్గజ సంస్థ, టాటా గ్రూప్ అనుబంధ సంస్థ టాటా మోటార్స్ సూపర్ డీల్ తీసుకొచ్చింది. తమ పోర్ట్‌ఫోలియోలోని వివిధ మోడళ్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించింది. గరిష్ఠంగా రూ.85 వేల వరకు డిస్కౌంట్లు కల్పిస్తోంది. అయితే, ఈ తగ్గింపు ఆఫర్ మార్చి నెలాఖరు వరకే ఉంటుందని కస్టమర్లు గుర్తుంచుకోవాలి. అలాగే ఈ డిస్కౌంట్ ఆఫర్ అనేది డీలర్‌షిప్, ప్రాంతాన్ని బట్టి మారుతుంది. ప్రస్తుతం టాటా మోటార్స్ కి చెందిన వివిధ మోడళల్లో ఏ కారుపై ఎంత డిస్కౌంట్ పొందవచ్చు అనేది జాబితా పరిశీలిద్దాం.

 

  • టాటా టియాగో పెట్రోల్ ఎంటీ కారుపై రూ.70 వేల వరకు తగ్గింపు పొందవచ్చు. ఇందులో నేరుగా క్యాష్ డిస్కౌంట్ రూ.45 వేలు వస్తుంది. అలాగే ఎక్స్చోంజ్ బోనస్ లేదా స్క్రాపేజీ బోనస్ రూ.15 వేలు పొందవచ్చు. దీంతో పాటు రూ.10 వేల కార్పొరేట్ బోనస్ లభిస్తుంది.
  • టాటా టియాగో పెట్రోల్ ఏఎంటీ కారుపై రూ.60 వేలు తగ్గింపు వస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ.35 వేలు ఉండగా ఎక్స్చేంజ్ బోనస్ రూ.15 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.10 వేలు లభిస్తోంది.
  • టాటా టియాగో సీఎన్‌జీ, టాటా టిగోర్ పెట్రోల్, టాటా టిగోర్ సీఎన్‌జీ.. ఈ మూడు కార్లపై గరిష్ఠంగా రూ.75 వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఇందులో రూ. 50 వేల క్యాష్ డిస్కౌంట్ వస్తుండగా.. ఎక్స్చేంజీ బోనస్ రూ.15 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.10 వేలు లభిస్తుంది.
  • టాటా నెక్సాన్ పెట్రోల్ ఎంటీ వేరియంట్ పై రూ.68 వేల తగ్గింపు లభిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ. 40 వేలు ఉండగా.. ఎక్స్చేంజీ బోనస్ రూ. 20 వేలు ఉంది. కార్పొరేట్ బోనస్ రూ. 8 వేలు లభిస్తుంది.
  • టాటా హారియర్ ఎంటీ, టాటా సఫారీ ఎంటీ కార్లపై గరిష్ఠంగా రూ.85 వేల తగ్గింపు అందిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ.50 వేలు లభిస్తుండగా.. ఎక్స్చేంజీ బోనస్ రూ.25 వేలు, కార్పొరేట్ బోనస్ రూ. 10 వేలు లభిస్తుంది.
  • టాటా ఆల్ట్రోజ్ డీజిల్ కారుపై రూ. 55 వేల తగ్గింపు అందిస్తోంది. ఇందులో రూ.30 వేల క్యాష్ డిస్కౌంట్, రూ.10 వేల ఎక్స్చేంజీ బోనస్, రూ. 15 వేల కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తున్నాయి.
  • టాటా న్యూహారియర్, టాటా న్యూ సఫారీలపై రూ.50 వేల తగ్గింపు కల్పిస్తోంది. ఇందులో రూ.40 వేల క్యాష్ డిస్కౌంట్, రూ.10 వేల కార్పొరేట్ డిస్కౌంట్ కల్పిస్తోంది.
  • నెక్సాన్ పెట్రోల్ ఏఎంటీ కారుపై రూ.48 వేల తగ్గింపు ఇస్తోంది. ఇందులో రూ. 20 వేల క్యాష్ డిస్కౌంట్ వస్తుండగా.. రూ. 20 వేల ఎక్స్చేంజీ బోనస్ తో పాటు రూ.8 వేల కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తోంది.
  • న్యూ నెక్సాన్ పెట్రోల్, న్యూ నెక్సాన్ డీజిల్, కార్లపై రూ.38 వేల వరకు తగ్గింపు ఇస్తోంది. ఇందులో రూ.30 వేలు నేరుగా క్యాష్ డిస్కౌంట్ అందుతోంది.


Latest News
more

Trending
more