సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజేత తమిళనాడు




బీసీసీఐ నిర్వహించిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని తమిళనాడు జట్టు కైవసం చేసుకుంది. ఆదివారం రాత్రి అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంలో బరోడాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి రెండో సారి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని గెలుచుకున్నది.

టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బరోడా జట్టు మణిమారన్ సిద్దార్థ్ ధాటికి కుదేలైంది. కేవలం 36 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశలో బరోడా బ్యాట్స్‌మాన్ విష్ణు సోలంకి (49) ఆదుకున్నాడు. అతిత్ సేథ్ (29), సోలంకి (49) కలసి 7వ వికెట్‌కు 58 పరుగులు జోడించారు. తమిళనాడు బౌలర్ మణిమారన్ సిద్దార్థ్ 4 వికెట్లు తీయడంతో పాటు బరోడా జట్టు రనౌట్ల రూపంలో కూడా వికెట్లు పారేసుకుంది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది.

121 పరుగులు విజయలక్ష్యంతో బరిలోకి దిగిన తమిళనాడు ఓపెనర్ జగదీషన్ (14) వికెట్ త్వరగానే కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ హరి నిషాంత్ (35), బాబా అపరాజిత్ (29), దినేష్ కార్తీక్ (22) జట్టును విజయం వైపు నడిపించారు. చివర్లో షారుక్ ఖాన్ కేవలం 7 బంతుల్లో 18 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో 18 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి తమిళనాడు 123 పరుగులు చేసింది. దీంతో 3 వికెట్ల తేడాతో ఫైనల్ మ్యాచ్ గెలిచి రెండో సారి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని గెలుచుకుంది. సిద్దార్థ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

 

Latest News
more

Trending
more