క్రికెట్ అభిమానులకు షాక్...మరోసారి ఆసుపత్రిలో చేరిన గంగూలీ




బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ మరోసారి ఛాతీ నొప్పితో ఆసుపత్రి పాలయ్యారు. ఆయన  గుండె నొప్పితో బాధపడడంతో కుటుంబసభ్యులు కోల్ కతాలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. గంగూలీకి జనవరి 2న మొదటిసారి ఛాతి నొప్పి వచ్చింది. ఇటీవలే ఆయన వ్యాయామం చేస్తుండగా అస్వస్థతకు గురికావడంతో కోల్ కతా వుడ్ లాండ్స్ ఆసుపత్రికి తరలించారు. 
అక్కడి వైద్యులు ఆయనకు ఏంజియోప్లాస్టీ నిర్వహించారు.  అవసరమైతే మరోసారి ఏంజియోప్లాస్టీ చేయాల్సి ఉంటుందని వుడ్ లాండ్స్ వైద్యులు తెలిపారు. సర్జరీ అనంతరం గంగూలీ కోలుకోవడంతో అభిమానులు ఎంతో సంతోషించారు. దీంతో వైద్యులు ఆయనను జనవరి 9న డిశ్చార్జ్ చేశారు. 

ఇంటి వద్దనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్న గంగూలీకి  ఈ మధ్యాహ్నం గుండె నొప్పి రావడంతో బాధతో విలవిలలాడారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన అపోలో హాస్పిటల్ లో చేర్చారు. మరోసారి తమ అభిమాన క్రికెటర్ గంగూలీ ఆసుపత్రిపాలవడంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు దాదా త్వరగా కోలుకోవాలని కామెంట్ చేస్తున్నారు. ఛాంపియన్ క్రికెటర్ ఛాంపియన్ లా ఆసుపత్రి నుంచి తిరిగి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు దాదా హెల్త్ కండిషన్ పై ప్రముఖులు ఆరా తీస్తున్నారు. 


Latest News
more

Trending
more