కొందరు మగవాళ్లకు లొంగిపోయా: ప్రముఖ నటి వెల్లడి




సినీ ఇండస్ట్రీలో నటిగా నిలదొక్కుకునే క్రమంలో సీనియర్ నటి జయలలిత ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. వెండితెరపై హీరోయిన్ గా అరంగేట్రం చేసినా, ఆ తర్వాత వాంప్ పాత్రలకు పరిమితమమయ్యారు.

కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేశానని పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు కూడా. వినోద్ అనే కన్నడ దర్శకుడిని పెళ్లాడిన జయలలిత అతని చేతిలో చిత్రహింసలు పడి, చివరకు విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఒంటరిగా జీవిస్తున్నారామె. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె సెన్సేషనల్ కామెంట్లు చేశారు. కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు మగవాళ్లకు లొంగిపోవలసి వచ్చిందన్నారు.

మలయాళ సినిమాతో ఆమె సినీ జీవితం ప్రారంభమైంది. రెండో సినిమాలోనే కమల్ హాసన్ సరసన నటించారామె. ఇంద్రుడు చంద్రుడుతో తెలుగు సినీరంగానికి వచ్చి దాదాపు 600కు పైగా సినిమాల్లో నటించారు. తన సినీ జీవిత విశేషాలను ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ తో పంచుకున్నారు. వ్యాంప్ కేరక్టర్లు వేయడంతో తను వ్యక్తిగతంగానూ అలాగే ఉంటానని చాలామంది భావించేవారనీ, అవుట్ డోర్ షూటింగులకు వెళ్లినప్పుడు రాత్రివేళ తలుపు కొట్టి రభస చేసేవారనీ జయలలిత చెప్పారు. 'అందంగా ఉండేదాన్ని. పైగా వాంప్ కేరక్టర్లు వేసేదాన్ని. అందువల్ల అది అలుసుగా తీసుకుని చాలామంది ప్రయత్నించేవారు. ఒక నటుడు రాత్రివేళ తలుపు కొట్టి వేధించాడు, తలుపు తీయకపోతే ఉరేసుకుని చచ్చిపోతానని బెదిరించాడు. అలాంటప్పుడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేదాన్ని. తప్పించుకోలేని పరిస్థితులలో లొంగిపోయేదాన్ని' అని ఆమె తెలిపారు. ఒక మలయాళ దర్శకుడు రమ్మంటే తాను వెళ్లనందుకు తన సినిమాలోంచి నన్ను తీసేశాడని జయలలిత చెప్పారు.

'మొదటి పెళ్లి ఫెయిలయ్యాక మళ్లీ పెళ్లి చేసుకోవాలనిపించలేదు. కొంతమంది వచ్చి నన్ను ఉంచుకుంటామన్నారు. ఇంకొందరు పెళ్లి చేసుకుంటామన్నారు. కానీ నాకు పెళ్లిపై ఆసక్తి పోయింది. సీనియర్ నటి అన్నపూర్ణవంటి వాళ్లు కనీసం ఒక బిడ్డనైనా పెంచుకొమ్మని సలహా ఇచ్చారు. కానీ అది కూడా నాకు ఇష్టం లేదు' అని ఆమె చెప్పుకొచ్చారు.

 శరత్ బాబుతో బిడ్డను కనాలని అనుకున్నా

ప్రముఖ నటుడు శరత్ బాబుతో తనకు ఎంతో సాన్నిహిత్యం ఉందని జయలలిత చెప్పారు. 'శరత్ బాబును బావ అని, రమాప్రభను అక్క అని పిలిచేదాన్ని. శరత్ బాబుతో కలసి ఎన్నో తీర్థయాత్రలకు కూడా వెళ్లాను. ఆయనతో ఒక బిడ్డను కనాలని అనుకున్నాను. కానీ శరత్ బాబు ఎంతో ఆలోచించి వద్దని వారించారు. మనిద్దరం చనిపోతే ఆస్తికోసం ఎవరైనా ఆ బిడ్డను ఏమైనా చేయవచ్చు. అందుకని వద్దు లలితా అని శరత్ బాబు వారించారు. ఆయన చివరిరోజుల్లో ఆస్పత్రికి వెళ్లి చూసేదాన్ని. కానీ చనిపోయినప్పుడు మాత్రం వెళ్లలేకపోయాను' అని జయలలిత చెప్పారు. శరత్ బాబు ఎంతో మంచి వ్యక్తని, ఎప్పుడూ దైవధ్యానంలో సమయం గడిపేవారనీ ఆమె అన్నారు
 


Latest News
more

Trending
more