స్టాక్ మార్కెట్లో సంచలనం.. 50 వేల మార్కు దాటిన సెన్సెక్స్




దేశీయ స్టాక్ మార్కెట్ బోంబే స్టాక్ ఎక్సైంజ్ సంచలనం సృష్టించింది. గత కొన్ని రోజులుగా ఆర్థిక వ్యవస్థలో స్తబ్దత, డిమాండ్ పతనం చెందిన నేపథ్యంలోనూ మార్కెట్ల బుల్ దూకుడు కొనసాగించాయి. గురువారం ఉదయం స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడ్ అయ్యాయి. ఉదయం మార్కెట్లు ప్రారంభమైన తర్వాత 9.29 గంటలకు సెన్సెక్స్ ఏకంగా 306 పాయింట్ల లాభంలోకి దూసుకొని పోయింది. దీంతో చరిత్రలో తొలి సారిగా సెన్సెక్స్ 50వేల మార్కును దాటింది.

ఉదయం 10.22 సమయంలో సెన్సెక్స్ 250 పాయింట్ల లాభంతో 50,062 వద్ద, నిఫ్టీ 81 పాయింట్ల లాభంతో 14,726 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ప్రధాన రంగాల సూచీలన్నీ పాజిటివ్‌గా కదులుతుండటం విశేషం. కాగా, అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు జోరుగా ట్రేడ్ అవుతున్నాయి. బుధవారం అమెరికా మార్కెట్లు కూడా లాభాలను నమోదు చేశాయి. అదే జోరును గురువారం జపాన్, చైనా, ఇండియా మార్కెట్లు కొనసాగిస్తున్నాయి.


Latest News
more

Trending
more