వాట్సప్ కి పోటీగా సందేశ్ యాప్




కొత్త ప్రైవసీ పాలసీతో ఊహించని చిక్కులు ఎదుర్కొంటున్న వాట్సప్ కి మరో ఎదురుదెబ్బ తగలనుంది. ఓవైపు వినియోగదారులు ప్రత్యర్థి యాప్స్ సిగ్నల్, టెలిగ్రామ్ వైపు మొగ్గుచూపుతుండగా, మార్కెట్ లోకి మరో కొత్త యాప్ రానుంది. వాట్సప్ కి ధీటుగా దేశీయ యాప్ ను తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. సందేశ్ పేరుతో నూతన మెసేజింగ్ యాప్ ను రూపొందించింది కేంద్రం. సందేశ్ యాప్ లో డాటా తస్కరణకు అవకాశాలు లేవని, గోప్యతకు ఎలాంటి భంగం వాటిల్లదని ప్రచారం చేస్తున్నారు. వాట్సప్ ని ఎదుర్కొనేందుకు ప్రత్యేకమైన ఫీచర్స్ తో ఈ యాప్ ని రూపొందించారు. 

కేంద్రం ప్రవేశపెడుతున్న ఈ యాప్ లో పుట్టిన రోజు, చిరునామా, మెయిల్ ఐడీ, వృత్తి తదితర వివరాలను నమోదు చేసుకోవచ్చు. సందేశ్ యాప్ లో లాగిన్ అవ్వడానికి మొబైల్ నెంబర్ తప్పనిసరి ఉండాల్సిన పనిలేదు. వ్యక్తిగత మొయిల్ ఐడీ ద్వారా కూడా సందేశ్ లో లాగిన్ అవ్వచ్చు. స్నేహితులతో మెయిల్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మెసేజింగ్ యాప్స్ లో ఇలాంటి ఫీచర్స్ లేకపోవడంతో సందేశ్ వినియోగదారులకు సులభంగా చేరువవుతుందని భావిస్తున్నారు. యాప్ లో ఏదైనా సమస్యలు ఎదురైతే... చాట్బాట్ ద్వారా టెక్నికల్ సపోర్ట్ పొందే అవకాశం ఉంటుంది. 


Latest News
more

Trending
more