మళ్ళీ వాయిదా పడ్డ RRR మూవీ రిలీజ్




 

Rajamouli దర్శక దిగ్గజం జక్కన్న , Jr NTR జూనియర్ ఎన్టీఆర్, Ramcharan రాంచరణ్ కాంబోలో వస్తూన్న RRR ఆర్ ఆర్ ఆర్ మూవీ రిలీజ్ మరో సారి వాయిదా పడింది. దసరా పండుగకు ఈ మూవీ రిలీజ్ అవుతుందని ముందు ప్రకటించినప్పటికీ కొన్ని సన్ని వేశాలను రీషూట్ చేయాల్సి ఉండటం, గ్రాఫిక్ వర్క్స్ పూర్తి కాకపోవడమే ఈ మూవీ రిలీజ్ వాయిదా పడటానికి కారణమ్నే ప్రచారం జరుగుతోంది. తమ మూవీ రిలీజ్ వేస్తున్నామని ప్రకటించిన మేకర్స్ మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేసేది మాత్రం చెప్పలేదు.

ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో థియేటర్లు ఇంకా తెరుచుకోకపోవడం, ఎప్పుడు తెరుస్తారో తెలియకపోవడం వల్ల రిలీజ్ డేట్ ప్రకటించలేకపోతున్నామని మూవీ యూనిట్ తెలిపింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అక్టోబర్ 21 కల్లా పూర్తవుతుందని చెప్పిన మూవీ యూనిట్ వరల్డ్ మూవీ మార్కెట్ పూర్తిగా చక్కబడ్డ తర్వాత, వీలయినంత తొందరగా మూవీ రిలీజ్ చేస్తాం అని ప్రకటించింది. 


Latest News
more

Trending
more