తొలి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్.. రిషబ్ పంత్




ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఈ ఏడాది జనవరి నుంచి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ప్రారంభించింది. గతంలో డికేడ్, ఇయర్ అవార్డులు ఉండగా.. కొత్తగా నెలవారీ అవార్డులను ప్రవేశపెట్టింది. జనవరి నెలకుగాను రిషబ్ పంత్, జో రూట్, పాల్ స్టిర్లింగ్‌లను నామినేట్ చేసింది. అయితే ఆన్‌లైన్ పోలింగ్‌తో పాటు జ్యూరీలో ఎక్కువ ఓట్లు పంత్‌కు దక్కడంతో అతడిని ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ప్రకటించింది.

ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఇండియా సిరీస్ గెలుచుకోవడంలో పంత్ కీలక పాత్ర పోషించాడు. మూడో టెస్టులో 97 పరుగులు చేసి మ్యాచ్ ఓడిపోకుండా కాపాడాడు. ఇక గబ్బా టెస్టులో తన దూకుడైన బ్యాటింగ్‌తో 89 పరుగులు చేసి టీమ్ ఇండియాకు విజయాన్ని అందించాడు. దీంతో ఈ అవార్డును ఐసీసీ పంత్‌కు అందించింది. 'ఈ నెలలో మనకు పంత్ బ్యాటింగ్, ఇండియా విజయమే గుర్తుండి పోతుంది. టీమ్ ఇండియాకు ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకున్న పంత్‌కు అభినందనలు' అంటూ ఐసీసీ ట్వీట్ చేసింది.

ఇక సౌత్ ఆఫ్రికా క్రికెటర్ షభ్నిమ్ ఇస్మాయేల్‌కు మహిళల విభాగంలో ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకుంది.

 


Latest News
more

Trending
more