చిన్న నోట్లు రద్దు అంటూ ప్రచారం... క్లారిటీ ఇచ్చిన ఆర్బీఐ




 దేశంలో చిన్న నోట్లను రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా రద్దు చేయనుందని గత కొద్దీ రోజులుగా వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. రూ 100, రూ 10. రూ 5 రూపాయల నోట్లు మన దేశంలో ఎప్పటి నుంచో చలామణిలో ఉన్నాయి. 2016 నవంబర్ 8న పెద్దనోట్లు (1000, 500 రూపాయిలు) ను రద్దు చేసిన కేంద్రం 2000, 500 కొత్త నోట్లను తీసుకువచ్చింది. తాజాగా జరుగుతున్న చిన్న నోట్ల రద్దు ప్రచారంతో జనాలు షాక్ తిన్నారు. ఈ నోట్లు మార్చి నుంచి చెల్లుబాటు కావని ప్రచారం ఊపందుకుంది. దీంతో దేశంలో చాలా చోట్ల ఈ నోట్లను తీసుకునేందుకు భయపడుతున్నారు. ఇలాంటి ప్రచారమే గతంలో కూడా జరిగిన విషయం విదితమే. 2000 రూపాయల నోట్లను మరోమారు రద్దు చేయనున్నట్లు ప్రచారం జరిగింది. 

ఈ నేపథ్యంలో జరుగుతున్న ప్రచారంపై ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది. త్వరలో చిన్న నోట్లను ఉపసంహరించుకుంటున్నామని మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని స్పష్టం చేసింది. తమకు అలాంటి ఉద్దేశాల్లేవని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. తాజాగా ఆర్బిఐ నుంచి వచ్చిన ఆదేశాలతో చిన్న నోట్ల రద్దు ప్రచారం ఆగిపోనుంది. నోట్ల జీవిత కాలం తక్కువ కావడంతో వాటి స్థానాలలో ఆర్బీఐ కాయిన్స్ ను తీసుకువచ్చింది. 10, 50, 100 రూపాయల కాయిన్స్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. మొదట 10 రూపాయల కాయిన్ మార్కెట్ లోకి వచ్చింది. కానీ 10 రూపాయిల కాయిన్ ను తీసుకునేందుకు వ్యాపారస్తులు భయపడ్డారు. దీంతో 50, 100 రూపాయల కాయిన్స్ మార్కెట్ లో పెద్దగా సర్క్యూలేట్ కాలేదు. దీంతో ఆర్బీఐ 2018లో రూ.10, రూ.50తో పాటు కొత్తగా రూ.200 నోట్లను ముద్రించింది.  2019లో సరికొత్తగా రూ.100 నోట్లను తీసుకువచ్చింది.
 


Latest News
more

Trending
more