జగన్ ను కలిసిన పీవీ సింధు - త్వరలో విశాఖలో అకాడమీ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటన‌




పీవీ సింధు విశాఖపట్నంలో త్వరలో స్పోర్ట్స్ అకాడమీ ప్రారంభించనున్నారు. అందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆమెకు స్థలం కేటాయించినట్టు ఆమె తెలిపి‍ంది.

టొక్యో ఒలంపిక్స్ లో కాంస్య పతకం సాధించిన అనంతరం ఆమె మొదటి సారి ఏపీకి వచ్చారు. కుటుంబ సభ్యులతో పాటు ఆమె విజయవాడ లోని కనకదుర్గమ్మను సందర్శించిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని కలిశారు. ఈ సందర్భంగా సింధును అభినందించిన సీఎం ఆమెను శాలువా కప్పి సత్కరించారు. ఆమెకు ఏపీ ప్రభుత్వం తరపున 30 లక్షల రూపాయలను అందజేశారు. 

విశాఖపట్నంలో వెంటనే స్పోర్ట్స్ అకాడమీ ప్రారంభించాలని ఈ సందర్భంగా జగన్ పీవీ సింధును కోరారు. రాష్ట్రంలో సింధులాంటి వారి మరింత మందిని తయారు చేయాలని ఆమెతో జగన్ అన్నారు. 

జగన్ ను కలిసిన అనంతరం పీవీ సింధు మీడియాతో మాట్లాడుతూ... జగన్ ను కలవడం ఆనందంగా ఉందని ఆమె అన్నారు. ఏపీ ప్రభుత్వ క్రీదలను బాగా ప్రోత్సహిస్తోందని, ఉద్యోగాలలో క్రీడా కారులకు 2 శాతం రిజర్వేషన్ కూడా కల్పించడం గొప్ప విషయమని ఆమె అన్నారు. స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేయడం కోసం తనకు విశాఖలో ప్రభుత్వం స్థలం కేటాయించిందని, త్వరలోనే అకాడమీ ఏర్పాటు చేయబోతున్నట్టు ఆమె చెప్పారు. 


Latest News
more

Trending
more