ప్రభాస్ మ‌రో సాహసం - భారీ పోరాట సీన్లలో డూప్ లేకుండానే...




 

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ డూప్ లేకుండా భారీ పోరాట సన్నివేశాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ మధ్య ఏ మూవీ చేసినా ఆ మూవీలోని పాత్రకు తగ్గట్టు తమను తాము మార్చుకుంటున్నారు యువ హీరోలు.  ‘బాహుబలి' మూవీ కోసం కష్టపడి కండలు పెంచిన ప్రభాస్ ఇప్పుడు మరో సాహసం చేయనున్నాడు.

పానిండియా మూవీ 'ఆదిపురుష్' లో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. రామాయణం అంటేనే అందులో భారీ పోరాట సన్నివేశాలుంటాయి. ఇప్పుడా మూవీ క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. వచ్చే నెల 9వ తేదీ వరకు సాగే ఈ షెడ్యూల్ లో ప్రధానంగా పోరాట సన్నివేశాలో షూట్ చేస్తారు. ఈ సన్నివేశాల కోసం డూప్ లేకుండా నటించాలని డిసైడ్ అయ్యాడట ప్రభాస్ అందుకోసం స్టంట్స్ రిహార్సల్స్ చేస్తూ తీవ్రంగా కష్టపడుతున్నాడట. 

బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో వస్తూన్న 'ఆదిపురుష్' మూవీ పాన్ ఇండియా మూవీగా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో వస్తోంది. ఒకే సారి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు మేకర్స్. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా కృతి సనన్ సీతగా సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటిస్తున్నారు. అక్టోబర్ లో ఈ మూవీ షూటింగ్ పూర్తవుతుందని సమాచారం.


Latest News
more

Trending
more