మోడీ లేకపోతే మీరాభాయి చాను పతకం సాధించేదే కాదు - మణిపూర్ సీఎం




భారత ప్రధానినరేంద్ర మోడీ లేకపోతే భారత వెయిట్ లిఫ్టర్ మీరాభాయి చాను పతకం సాధించేదే కాదట. అవును ఇది నిజమని చెబుతున్నాడు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్. తనకు ఆరోగ్య సమస్యలున్నాయని సహకరించాలని ఓ బహిరంగ కార్యక్రమంలో మీరాభాయి చాను ముఖ్యమంత్రికి విఙప్తి చేశారని ఆ విషయం తెలిసిన మోడీ సత్వరం స్పంధించి ఆమె కండరాల ఆపరేషన్ కోసం అమెరికా పంపారని, పైగా ఆ తర్వాత కూడా ఆమెకు ఉత్తమ శిక్షణ అందించారని ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ తెలిపారు. ఆ విషయం తెలిసి తాను చాలా ఆశ్చర్యపోయానన్నారు సీఎం.

ఒకవేళ మోడీ సహకరించి చానుకు కండరాల సర్జరీ చేయించకపోతే ఆమె పతకం సాధించలేకపోయేదని అన్నారు సీఎం సింగ్. మోడీ చేసిన సహాయం తెలిసి మణిపూర్ ప్రజలు చాలా సంతోషిస్తున్నారని ప్రధానికి కృతఙతలు చెబుతున్నారని ఆయన అన్నారు. ఈ మధ్య తాను ఢిల్లీ వెళ్ళినప్పుడు మోడీని కలిసి ఈ విషయంపై కృతఙతలు తెలియజేశానని మణిపూర్ ముఖ్యమంత్రి చెప్పారు.


Latest News
more

Trending
more