మూవీ పైరసీతో వేల కోట్ల ఆదాయం...... ప్రోత్సహిస్తున్న గూగుల్, అమెజాన్




కోట్ల రూపాయల పెట్టుబడితో సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలకు పైరసీ అనేది పెద్ద తలనొప్పిగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా, పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మూవీ పైరసీని ఆపలేకపోతున్నారు. అయితే మూవీలను పైరసీ చేసి వివిధ సైట్లలో పెట్టేవాళ్ళు ఆ పని సరదా కోసం చేస్తారా ? కాదు దాని ద్వారా వాళ్ళు కోట్ల రూపాయల బిజినెస్ చేస్తున్నారు. మూవీలను, ప్రముఖ టీవీ షోలను పైరసీ చేయడం ద్వారా పైరేటెడ్ సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా ? 9,660 కోట్ల రూపాయలు. ఇంత ఆదాయం ఎలా వస్తోందనే సందేహం కలగడం సహజమే. అయితే ఈ ఆదాయం ఆ సైట్లు యాడ్ల ద్వారా పొందుతున్నారు. 

ఈ పైరేటెడ్ సైట్లకు యాడ్లు ఇచ్చే సంస్థలు కూడా చిన్నా చితకవి కావు. గూగుల్, ఫేస్ బుక్, అమేజాన్ వంటి దిగ్గజ కంపనీలు కూడా ఈ సైట్లకు యాడ్స్ ఇస్తున్నాయి. ఇవే కాక ప్రముఖ ఈ కామర్స్ కంపనీలన్నీ ఈ సైట్లకు యాడ్స్ ఇస్తున్నాయి. పలు పోర్న్ కంపెనీలు కూడా ఈ సైట్లకు పెద్ద ఎత్తున యాడ్లు ఇస్తున్నాయి. 

దాదాపు 80 వేల పైరేటెడ్ సైట్లు మూవీలను, టివీ షోలను పైరసీ చేస్తున్నాయి. ఒక వైపు పైరసీ కాకుండా ఆపడం కోసం నిర్మ్శ్తలు, పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంటే ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలు ఆ సైట్లను పోషించే పనిలో ఉన్నాయి. 


 


Latest News
more

Trending
more