గూగుల్ కు షాక్…గుడ్ బై చెబుతున్న యూజర్లు




సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ కు షాక్ తగిలింది. ప్రపంచ వ్యాప్తంగా యూజర్లు గూగుల్ ను పక్కనబెడుతున్నారని ఓ సర్వేలో తేలింది. ఇన్నేళ్లుగా గూగుల్ ఆధిపత్య ధోరణికి చెక్ పడటం ఖాయమంటూ నిపుణులు చెబుతున్నారు. యూజర్ల డేటా ప్రొఫైల్ తో బిజినెస్ చేసే సోషల్ మీడియా ప్లాటుఫామ్స్ పై యూజర్లు గత కొన్ని రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రైవసీ పాలసీ విషయంలో జాగ్రత్తలు తీసుకునే ప్లాటుఫామ్స్ పై ద్రుష్టి సారించారు. ఇటీవలే మెసెంజర్ యాప్ వాట్సప్ తమ ప్రైవసీ పాలసీలో మార్పులు చేసింది. ఈ మార్పులను అంగీకరించని యూజర్లు వాట్సప్ యాప్ ను అన్ ఇన్స్టాల్ చేశారు. కోట్లాది మంది యూజర్లు తమ యాప్ కు గుడ్ బై చెప్పడంతో వాట్సప్ మేలుకుంది. యూజర్లకు భరోసానిచ్చే ప్రయత్నం చేసింది. ప్రైవసీకి భంగం వాటిల్లదని యూజర్ల డేటా ప్రొఫైల్ ను తాము ఎవరితో పంచుకోబోమని స్పష్టం చేసింది. కానీ జరగవలసిన నష్టం జరిగిపోయింది. చాలా మంది యూజర్లు వేరే మెసెంజర్ యాప్స్ లైన్, టెలిగ్రాంలలో జాయిన్ అయ్యారు. 

వాట్సప్ పరిస్థితే గూగుల్ కు ఎదురయింది. తమ ప్రొఫైల్ తో వ్యాపారం చేసే గూగుల్ ను కాదని వేరే సెర్చ్ ఇంజన్ లపై ద్రుష్టి సారించారు. ప్రైవసీకి పెద్ద పీట వేసే సెర్చ్ ఇంజన్ లను యూజర్లు వాడుతున్నట్లు నివేదికలో తేలింది. బింగ్, బైడు, యాహు, యాన్డెక్స్, డక్ డక్ గో సెర్చ్ ఇంజన్ లపై ద్రుష్టి సారించారు.యూజర్ల ఐపీ అడ్రెస్స్ ను సేకరించని డక్ డక్ గో సెర్చ్ ఇంజన్ ను ఎక్కువ వాడుతున్నట్లు తెలిసింది. డక్ డక్ గోలో ఉపయోగిస్తున్న బిజినెస్ మోడల్ వల్ల థర్డ్ పార్టీ ట్రాకర్లు పని చేయవని దీనివల్ల మనకు రకరకాల యాడ్స్ రావని చెబుతున్నారు. గూగుల్ లో మనం బ్రౌజ్ చేసే వెబ్సైట్, థర్డ్ పార్టీ ట్రాకర్లు, లొకేషన్లను సేకరించి మనం వేటిని చుస్తున్నామో, వేటిని ఇష్టపడతామో అనే అంచనాకు వస్తారు. ఆ తరువాత దీనికి సంబందించిన యాడ్స్ మనకు దర్శనమిస్తుంటాయి. ఈ బాధలేని డక్ డక్ గోలో ఈ మధ్య కాలంలో యూజర్లు ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నట్లు నిపుణులు గుర్తించారు. 


Latest News
more

Trending
more