ఐఎఫ్ఎస్‌సీ కోడ్లు మారిపోతున్నాయి




ఆన్‌లైన్ బ్యాంకు లావాదేవీల్లో కీలకమైన ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లు మారిపోతున్నాయి. దేశవ్యాప్తంగా పలు జాతీయ బ్యాంకులు విలీనం కావడంతో బ్యాంకు కోడ్స్ మార్చాల్సి వస్తున్నది. ఇప్పటికే ఆంధ్రాబ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకుల IFSC కోడ్‌లు వచ్చే నెల 1 నుంచి మారి కొత్తవి రాబోతున్నాయి. ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకులను యూనియన్ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వం విలీనం చేయడంతో.. విలీన ప్రక్రియ ఇప్పుడిప్పుడే జరుగుతోంది.

ఏప్రిల్ 1 నుంచి ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకులకు కొత్త IFSC కోడ్‌లు అమల్లోకి తీసుకొస్తున్నట్లు యూనియన్ బ్యాంకు తెలిపింది. ఆంధ్రా బ్యాంకు IFSC కోడ్‌లను యూబీఐఎన్ 08తో మొదలయ్యే విధంగా మార్చుతుండగా.. కార్పొరేషన్ బ్యాంకు IFSC కోడ్‌లను 09తో మొదలయ్యేలా మార్చుతున్నారు.

ప్రస్తుతం వినియోగదారులు ఉపయోగిస్తున్న ఆంధ్రాబ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు చెక్ బుక్‌లు కూడా పని చేయవని చెబుతున్నారు. కొత్త ఐఎఫ్ఎస్‌సీ, ఎంసీఐఆర్ నెంబర్లు ముద్రించిన చెక్ బుక్‌లను ఖాతాదారులకు అందించనున్నారు.


Latest News
more

Trending
more