మొక్కు తీర్చుకున్న టీమిండియా క్రికెటర్ నటరాజన్




టీమిండియా క్రికెటర్ టీ నటరాజన్ మొక్కు తీర్చుకున్నారు. తమిళనాడుకు చెందిన నటరాజన్ పళని సుబ్రమణ్య స్వామిని దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నాడు.  విషయం తెలిసిన అభిమానులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని నటరాజన్‌తో సెల్ఫీలు దిగారు. గత ఏడాది సెప్టెంబర్ 19 వరకు నటరాజన్ గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. రంజీ ట్రోఫీలో తమిళనాడు జట్టుకు ఆడే నట్టూ చెన్నై క్రికెట్ లీగ్ ద్వారా వెలుగులోకి వచ్చారు. ఆ లీగ్ లో కనిపించిన ప్రదర్శనతో సన్ రైజర్స్ హైదరాబాద్  జట్టు నట్టూని ఐపీఎల్ లోకి ఎంపిక చేశారు. ఐపీఎల్-13లో 13 మ్యాచ్ లు ఆడిన నటరాజన్ 14 వికెట్లు తీశారు. లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ తో స్టార్ బ్యాట్సమెన్ లను కూడా ఇబ్బంది పెట్టాడు. దీంతో ఆసీస్ పర్యటనకు నటరాజన్ ను టీమిండియా నెట్ బౌలర్ గా ఎంపిక చేసింది. 

నెట్ బౌలర్ గా ఎంపికైన నటరాజన్ కు అనుకోని అదృష్టం కలిసి వచ్చింది. కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడటంతో నట్టూకి చివరి వన్డేలో ఆడే అవకాశం లభించింది. అక్కడ చక్కని ప్రదర్శన కనపరచడంతో టీ20లలో అవకాశం దక్కింది. దీంతో టెస్టులకు కూడా అతనిని టీమిండియా స్టాండ్ బైగా ఉంచుకుంది. ప్రధాన బౌలర్లు దూరం కావడంతో నటరాజన్ కు చివరి టెస్టులో అవకాశం లభించింది. మూడు కీలక ఆసీస్ వికెట్లు తీసిన నటరాజన్ చక్కని ప్రదర్శన చేశాడు. ఎంట్రీతోనే అన్నీ ఫార్మట్స్ ఆడిన నటరాజన్ స్వస్థలానికి రాగానే రధం మీద ఊరేగించిన సంగతి తెలిసిందే. ఆసీస్ పర్యటనలో ఉన్న సమయంలోనే నటరాజన్ తండ్రి అయ్యాడు. కెరీర్ పరంగా, లైఫ్ పరంగా హ్యాపీగా ఉన్న నటరాజన్ పళని సుబ్రమణ్య స్వామిని దర్శించుకున్నారు. 


Latest News
more

Trending
more